పొలిటికల్ ఎంట్రీపై స్టార్ హీరో క్లారిటీ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడతారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల తన అభిమాన సంఘాలలోని కీలక సభ్యులతో విజయ్ చెన్నై శివార్లలోని తన ఫాం హౌస్‌లో భేటీ అయి పొలిటికల్ అరగ్రేటంపై చర్చించాడని వార్తలొచ్చాయి. రాజకీయాల్లోకి రావాల్సిందిగా విజయ్‌పై ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకొస్తున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని విజయ్ భావిస్తున్నాడట.

vijay

తన అభిమానులు ఇతర పార్టీలలో చేరవద్దని, తానే త్వరలో కొత్త పార్టీ పెడతానని అభిమానులకు విజయ్ చెప్పేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘మక్కల్ ఇయక్కం’ పేరుతో విజయ్ ఒక స్వచ్చంధ సంస్థను నడుపుతున్నాడు. దీంతో ఆ సంస్థ పేరుతో రాజకీయ పార్టీని విజయ్ ఏర్పాటు చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై తాజాగా విజయ్ తన సన్నిహితుల దగ్గర స్పందించినట్లు టాక్. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా?.. లేదా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయడమా? అనేది ఆలోచిస్తున్నట్లు సన్నిహితులతో విజయ్ చెప్పాడట. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.