ఎక్కడో కాకినాడలో మ్యూజిక్ చేసుకునే నన్ను ఈ రోజు ఇలా అల్లు అరవింద్ గారి ముందు మాట్లాడేలా చేసిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్ – మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘ఎక్కడో కాకినాడలో మ్యూజిక్ చేసుకునే నన్ను ఈ రోజు ఇలా అల్లు అరవింద్ గారి ముందు మాట్లాడేలా చేసిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. సాయి రాజేష్, విజయ్ బుల్గానిన్‌ను కలిపితేనే బేబీ సినిమా మ్యూజిక్ వచ్చింది. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌ గార్ల నటనను చూసి నేను ఫ్యాన్ అయ్యాను. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుందో రాదో తెలియదు. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను సాయి రాజేష్ గారు ఇచ్చారు’ అని అన్నారు.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే ఫుల్ అయ్యాయి. కొత్త వాళ్లం కలిసి ఈ సినిమాను చేశాం. కానీ మా సినిమాకు విపరీతమైన బజ్ ఏర్పడింది. కంటెంట్ బాగుంది కాబట్టే ఇలాంటి క్రేజ్ వచ్చింది. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాలు, కంటెంట్ సినిమాలే ఎందుకు చేస్తావ్.. మీ అన్నలా మాస్ సినిమాలు చేయొచ్చు కదా? అని అందరూ నన్ను అడుగుతుంటారు. ఓ పదిమందిని కొడితే మాస్ హీరోనా? ఊరిని కాపాడితే మాస్ హీరోనా? ప్రేమలో నిజాయితీగా ఉండటమే కానీ నా దృష్టిలో మాస్. ఓ మెట్టు దిగి సారీ చెప్పడం కూడా మాసే. ఆ కోణంలో బేబీ మంచి మాస్ మూవీ. యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేమంటే ఏంటి? అని చెప్పే క్రమంలోనే సాయి రాజేష్‌ అన్న ఈ కథను రాసుకున్నారు. సాయి రాజేష్‌ గారి కోణంలో ప్రేమను చూపించబోతోన్నారు. ప్రతీ ఒక్కరూ తమను తాము నిరూపించుకునేందుకు ప్రాణం పెట్టి చేశాం. ఆడియెన్స్ కూడా సినిమాను ప్రేమిస్తారు. కుర్రాళ్లంతా వైష్ణవితో ప్రేమలో పడతారు. విరాజ్ అద్భుతంగా నటించాడు. థియేటర్లో ఇది నా మూడో సినిమా. ఇంత వరకు ఒక్క థియేట్రికల్ హిట్ లేదు. నాకు ఓ మంచి సినిమా ఇస్తా అని ఎస్‌కేఎన్ అన్న మాటిచ్చారు. ఇప్పుడు అది బేబీతో నిజం కాబోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ అన్నకు థాంక్స్’ అని అన్నారు.

వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ.. ‘బేబీ అనేది రియాల్టీలోంచి తీసుకున్న కథ. మన చుట్టూ ఉండేవాళ్ల కథ. బేబీ మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు పూర్తిగా సంతృప్తి చెంది వస్తారు. ఇవన్నీ మన జీవితాల్లో జరిగాయ్ కదా? అని కనెక్ట్ అవుతారు. యూట్యూబ్‌లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉండేదాన్ని. సడెన్‌గా నాకు బేబీ చాన్స్ వచ్చింది. నేను చేయగలను అని, నన్ను సాయి రాజేష్ గారు నమ్మి ముందకు నడిపించారు. ఈ పాత్ర గొప్పదనం గురించి నాకు ఎంతో చెప్పి మోటివేట్ చేసిన ఎస్‌కేఎన్ గారికి థాంక్స్. జూలై 14న అందరూ సినిమాను చూడండి. ఇది నా మొదటి మెట్టు. ఆడియెన్స్ ఇచ్చే రివ్య్యూలతోనే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని అన్నారు.

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా బేబీ టీంకు చాలా ప్రత్యేకం. ఈవెంట్‌కు వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. అనీష్ గారు నన్ను ధీరజ్ గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను సాయి రాజేష్ గారి వద్దకు తీసుకెళ్లారు. ఆయన తీసిన సినిమాలు చూశాను. కలర్ ఫోటో లాంటి సెన్సిటివ్ కథను రాశారా? అని షాక్ అయ్యాను. బేబీ సినిమాలో ఆయన రాసిన డైలాగ్‌లు మనసును హత్తుకునేలా ఉంటాయి. నేనొక గొప్ప దర్శకుడితో పని చేశాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ గారికి థాంక్స్. ఎస్‌కేఎన్ గారి సినిమా అంటే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. బేబీ అనేది కల్ట్ అవుతుందని నమ్మి మూడేళ్ల పాటు పని చేశారు. సాయి రాజేష్ గారి మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాను చేశారు. ఇందులో ఇద్దరం హీరోలం కదా? అని అడుగుతున్నారు. కానీ డైరెక్టర్, డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్‌, ఎడిటర్‌లే హీరోలు. వారి తరువాతే మేం. సినిమా విడుదలయ్యాక ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇది మా బేబీ. రేపటి నుంచి బేబీని ఆడియెన్స్ చేతుల్లో పెడుతున్నామ’ని అన్నారు