Vijay: మొద‌ల‌వుతున్న‌ విజ‌య్ 65వ చిత్రం..

Vijay: కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ మాస్ట‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోకి అనువాద‌మై రిలీజ్ అయ్యి..

vijay new film

సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూప‌లేదు.. అయితే ఈ చిత్రం విజ‌య్ కెరీర్‌లో 64వ సినిమా.. అనంత‌రం 65వ చిత్రంపై దృష్టి సారించాడు విజ‌య్‌. డాక్ట‌ర్ ఫేం నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో విజ‌య్ న‌టించ‌నున్నాడు. స‌న్‌పిక్చ‌ర్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌వుతోంది.