వినూత్నమైన ప్రొమోషన్స్లో ‘విద్యార్థి’ టీం

వినూత్నమైన ప్రొమోషన్స్లో ‘విద్యార్థి’ టీం
చేతన్‌ చీను, బన్నీవోక్స్‌ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆళ్ల వెంకట్‌, నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత డి.ఎస్‌.రావు ఆధ్వర్యంలో ఈ నెల 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ అయింది. తెలుగు రాష్ట్రాల అభిమానులను కలిసి సినిమా ముచ్చట్లను వివరిస్తున్నారు. తాజాగా చిత్ర హీరో చేతను చీను బృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరి,గుంటూరు, అమరావతి,పల్నాడు,వైజాగ్,విజయనగరం ఇలా పలు ప్రాంతాల్లోని కాలేజీ విద్యార్థులను మరియు అభిమానులను కలిశారు. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ
‘‘దర్శకుడిగా తొలి చిత్రమిది. చాలాకష్టపడి తీశాం. ఎక్కడా బ్రేక్‌ లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నాం. ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.

చేతను చీను మాట్లాడుతూ, ప్రతి ప్రాంతంలోనూ జరిగే ఓ అంశాన్ని తీసుకుని దర్శకుడు కథ రాశారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘సోమవారం కనకదుర్గమ్మని దర్శించుకున్నాం. తర్వాత అప్సల్యూట్ సాఫ్ట్వేర్ కంపెనీ, భాష్యం కాలేజ్, మహాత్మా గాంధీ కాలేజ్, ఆక్సి్ఫార్డ్స్ విట్, సీతం కాలేజీలో విద్యార్థులను కలిసాం. సినిమా ట్రైలర్ చూసి వారంతా చాల ఎక్సయిట్ అయ్యారు. మంచి స్పందన వచ్చింది. నేను కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ప్రేక్షకులు చక్కని ఆదరణ చూపిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండ అందరిని అలరిస్తుంది. ఈ చిత్రం మా అందరి తలరాతలను మారుస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.

‘ నెల 29న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు.

నటీనటులు

చేతన్‌ చీను,
బన్నీవోక్స్‌
రఘుబాబు,
జీవా,
టిఎన్‌ఆర్‌,
జ్వాలా కోటి,
దిశాంత్‌,
నవీన్‌నేని,
శరన్ అడ్డాల
జబర్దస్త్ అప్పారావు
పవన్ సురేష్
యాదమరాజు,
మణిచందన, తదితరులు

సాంకేతిక నిపుణులు
కెమెరా: కన్న.పి.సి,
సంగీతం: విజయ్‌ బుల్గానియన్‌,
ఎడిటర్‌: బి.నాగేశ్వరరెడ్డి,
స్టంట్స్‌: రామకృష్ణ,
కొరియోగ్రఫీ: అనీశ్‌,
కో-ప్రొడ్యూసర్‌: రామకృష్ణ రాజేటి,
లైన్‌ ప్రొడ్యూసర్‌: వంశీ తాడికొండ,
పి.ఆర్‌.ఓ: మధు.విఆర్‌ .