ఆస్కార్ రేంజులో విద్యాబాలన్ షేర్ని

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేస్తున్న విద్యాబాలన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షేర్ని. ఒక అడవి మనుషులని చంపి తినే పులి దాని నుంచి తప్పించుకోవాలని చూసే గ్రామస్థులు, పులిని పట్టుకోవడానికి ప్రణాళిక రచిస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీరి చుట్టూనే షేర్ని సినిమా కథాకథనం తిరుగుతున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్ గా విద్యాబాలన్ నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో, హై స్టాండర్డ్స్ తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. విద్యాబాలన్ లుక్ అండ్ అప్పీరెన్స్ చాలా కొత్తగా ఉంది. ఒక కంప్లీట్ ఫారెస్ట్ ఆఫీసర్ లాగే విద్యా కనిపించింది. ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ లో షేర్ని మూవీ జూన్ 18న ప్రీమియర్ కాబోతుంది అప్పటివరకు ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.