నారప్ప జెన్యూన్ రివ్యూ: వాళ్లు మాత్రమే చూడండి

‘విక్టరీ’ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తమిళ చిత్రం ‘అసురన్’ రిమేక్ ‘నారప్ప’ నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులో రిమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కొనుక్కున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మూవీ ఎలా ఉందొ చూద్దాం.

కథ

అనంతపురం దగ్గర్లోనే ఒక చిన్న పల్లెటూరు లో నారప్ప (వెంకటేష్)… అతని భార్య ప్రియమణి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. వీరు తక్కువ కులానికి చెందిన వారు కాగా… అదే ఊరిలో అగ్ర కులస్తుడు, పెద్దమనిషి అయిన పాండుసామి ఎలాగైనా నారప్ప పొలాన్ని కాజేయాలని చూస్తాడు. అదే సమయంలో పాండుసామి కొడుకుతో నారప్ప పెద్ద కొడుకు మునికన్నా గొడవ పడతాడు. మునికన్నా పాండుసామి కొడుకుని చితకబాదగా ప్రతీకారంగా పాండుసామి ముని న్నా నన్ను చంపిస్తాడు. అందుకు ప్రతీకారంగా నారప్ప చిన్న కొడుకు తన అన్న ని చంపిన పాండుసామిని చంపేస్తాడు. దీంతో ఊర్లో కలకలం రేగుతోంది. నారప్ప కుటుంబాన్ని చంపేయాలని పాండుసామి కుటుంబం ప్రయత్నిస్తున్న సమయంలో అసలు నారప్ప గతం ఏమిటి..? అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాడు…? చివరికి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు…? ఊరిలో ఈ కుల చిచ్చు తగ్గిపోయిందా లేదా అన్నది మిగిలిన కథాంశం.

విశ్లేషణ: నారప్ప సినిమా తమిళ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి మన వాతావరణం కనిపించేలా తెరకెక్కించారు. ఒరిజినల్ ఫీల్ మీ ఎక్కడా మిస్ అవ్వకుండా మన నేటివిటీకి మార్చడం గొప్ప విషయం. ఫ్యామిలీ సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాలా ఇంతటి మాస్ ఎలిమెంట్స్ కి హ్యాండిల్ చేయడం ఆశ్చర్య పరిచే అంశం. ఇక వెంకీ మామ యాక్టింగ్ విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత సరైన వెంకటేష్ ని స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతటి ఫెరోషియస్ రోల్ లో వెంకటేష్ స్క్రీన్ పై అద్భుతమే సృష్టించాడు. ప్రియమణి కూడా తన పాత్ర లో అదరగొట్టింది. వెంకటేష్, ప్రియమణి మధ్య సన్నివేశాలు వారి పెద్ద కొడుకు చనిపోయినప్పుడు వారు పండించిన హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలిచాయి.

మొత్తంగా చెప్పాలంటే ‘నారప్ప’ సినిమా ఒక సమస్యను ప్రస్తావిస్తూ తీసిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రేక్షకులకు అవసరమైన డ్రామా, ఎమోషన్స్, నేటివిటీ… అన్నీ ఉన్నాయి. నెగటివ్ విషయం చెప్పాలి వస్తే కథాను సారం, ఫస్ట్ పార్ట్ కాస్త స్పీడ్ గా, టెన్స్ నోట్ లో సాగినా కూడా సెకండ్ హాఫ్ కాస్త స్లో అవుతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్లో పేస్ లో సాగుతుంది. వెంకటేష్-ప్రియమణి నటన, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల సహా మిగిలిన సైడ్ క్యారెక్టర్లు కూడా తమ పాత్రలని అద్భుతంగా పోషించారు. రెండు జాతుల మధ్య ఉన్న వివక్ష, విభేదాలను చూపించడంలో దర్శకుడు సఫలం కాగా మణిశర్మ సంగీతం కూడా ఈ చిత్రాన్ని మరింత ఎత్తు కి తీసుకువెళ్ళింది. డైలాగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్సేస్ నారప్ప మూవీకి మెయిన్ ఎస్సెట్ అయ్యాయి. ధియేటర్ లో నారప్ప రిలీజ్ అయి ఉంటే అందరికీ దేగ్గరయ్యేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తమిళ సినిమాతో కంపేర్ చేయకుండా, వెంకటేష్ ని ఒక మంచి కథలో, యాక్షన్ మోడ్ లో చూడాలి అనుకున్న వాళ్లు మాత్రం అమెజాన్ ప్రైమ్ లో ‘నారప్ప’ సినిమా ని చూసేయండి.