ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చిన “వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్”

ఆహా ఓటీటీలో “వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్” స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరింత ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఈ క్రేజీ వెబ్ సిరీస్ వ్యూయర్స్ ను ఆకట్టుకుంటోంది.

“వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్” వెబ్ సిరీస్ లో మిర్చి కిరణ్, ఆర్జే కాజల్, అఖిల్ సార్థక్, మహేశ్ విట్టా, రితూ చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, రమణ భార్గవ్, రాజా విక్రమ్, రాజేశ్ ఎంపీఆర్, అఖిల్ వివాన్, మహేందర్.పి. శివ రుద్ర తేజ కీలక పాత్రల్లో నటించారు. “వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్” వెబ్ సిరీస్ ను పోలూరు ప్రొడక్షన్స్ నిర్మించింది. జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేత నిఖిల్ మల్యక్కల్ ఈ సిరీస్ లో నటించడం విశేషం. ప్రస్తుతం “వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్” నుంచి 1, 2 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎగ్జైటింగ్ కంటెంట్ తో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తాయి. “వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్”లో ఆఫీస్ లో జరిగే సరదా సన్నివేశాలు, మంచి ట్విస్టులు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.