మాస్ సాంగ్ కి మామా అల్లుళ్ళు డాన్స్…

‘ఎఫ్‌2’ సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేశ్, బాబీతో వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. వెంకటేశ్ తో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నిజానికి దసరాకే విడుదల కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వాళ్ల వెంకీ మామ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ నెల 6న వెంకీ మామ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది, రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో హీరో హీరోయిన్లు వెంకటేశ్, చై, రాశి, పాయల్ లపై ఓ పాటను తెరకెక్కించనున్నారు. వెంకీ మామ సినిమాలో ఈ సాంగ్‌ చాలా స్పెషల్‌గా ఉంటుందట. దీని కోసం ఎస్‌.ఎస్‌. తమన్‌ అదిరిపోయే ట్యూన్‌ ఇచ్చాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా స్టిల్స్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఒక మంచి మాస్ బీట్ సాంగ్ కి మామ అల్లుళ్లు కలిసి చిందేస్తే థియేటర్స్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు.