ఇద్దరమ్మాయిలతో ఆడిపాడనున్న మామ అల్లుళ్లు

విక్టరీ వెంకటేశ్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటించడంతో సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ వైబ్ ఉంది. రాశి ఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి చిన్న గ్లిమ్ప్స్ దసరా రోజున బయటకి వచ్చింది. చై, వెంకీల మధ్య కెమిస్ట్రీ కుదరడంతో వెంకీ మామ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

బాలన్స్ ఉన్న పాటల షూటింగ్ మొదలుపెట్టనున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఒక భారీ సెట్ ఒకటి వేసారు, ఈ సెట్‌లో హీరో హీరోయిన్లు వెంకటేశ్, చై, రాశి, పాయల్ లపై ఓ పాటను తెరకెక్కించనున్నారు. వెంకీ మామ సినిమాలో ఈ సాంగ్‌ చాలా స్పెషల్‌గా ఉంటుందట. దీని కోసం ఎస్‌.ఎస్‌. తమన్‌ అదిరిపోయే ట్యూన్‌ ఇచ్చాడని తెలుస్తోంది. ఒక మంచి మాస్ బీట్ సాంగ్ కి మామ అల్లుళ్లు కలిసి చిందేస్తే థియేటర్స్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు.