వియోలెన్స్ ఎక్కువగా ఉన్న కథతో వెంకీ మ్యాజిక్ చేస్తాడా?

ధనుష్ హీరోగా, వెట్రిమారన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా అసురన్. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అయ్యి సినీ అభిమానులని మెప్పిస్తోంది. ఇప్పటి వరకూ 150 కోట్లు రాబట్టిన అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. వెంకటేష్ హీరోగా, థాను సురేష్ బాబు కలిసి అసురన్ రీమేక్ ని నిర్మించనున్నారు. డైరెక్టర్ ఎవరూ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లక్ష్మీ, తులసి సినిమాల తర్వాత యాక్షన్ మూవీస్ కి పూర్తిగా దూరమైన వెంకటేష్, ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఈ ఏడాది ఎఫ్ 2తో హిట్ అందుకున్న వెంకటేష్, ఇప్పుడు వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు కానీ, వెంకీ మామ విడుదల అయిన తర్వాతే అసురన్ తెలుగు వెర్షన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబం కోసం నలభై ఏళ్ల వ్యక్తి చేసిన పోరాటమే అసురన్ కథ కథనం. వియోలెన్స్ ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని ప్యాడింగ్ చేసే స్థాయిలో హ్యూమన్ ఎమోషన్స్ ఉండడం అసురన్ సినిమా బలం.