మామా అల్లుళ్లు సంక్రాంతి పందెం కోళ్లుగా వస్తున్నారు

అక్కినేని దగ్గుబాటి హీరోలు వెంకటేష్, చైతన్య కలిసి నటిస్తున్న మొదటి సినిమా వెంకీ మామ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎఫ్ 2 సినిమాతో వెంకీ హిట్ ట్రాక్ ఎక్కడం, తనలో కామెడీ టైమింగ్ ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేసుకోవడంతో వెంకీ మామపై అంచనాలు మరింత పెరిగాయి. నాగ చైతన్య కూడా మజిలీ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవడం కూడా వెంకీ మామ సినిమాకి కలిసొచ్చే అంశం. ఈ మామ అల్లుళ్ళ కాంబినేషన్ కోసం అక్కినేని దగ్గుబాటి కుటుంబ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా దసరాకి చిన్న గ్లిమ్ప్స్ బయటకి వస్తే, ఈ చిన్న విడియోలోనే మామ అల్లుళ్ల మధ్య కెమిస్ట్రీకి సినీ అభిమానులంతా ఫిదా అయ్యారు.

venky mama

వెంకటేష్, చైతన్యకి రాశి కన్నా పాయల్ కూడా కలవడంతో వెంకీ మామకి కావాల్సినంత గ్లామర్ కూడా యాడ్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బాబే ప్రధాన బలం. ఎంత పోటీ ఉన్నా తన సినిమాకి థియేటర్స్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు కాబట్టి వెంకీ మామకి మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. 2019 సంక్రాంతికి నవ్వించిన వెంకటేశ్, 2020 సంక్రాంతి వెంకీ మామ అంటూ రాబోతున్నాడు. పండగ సీజన్ లో సినీ అభిమానులు కోరుకునేదే ఫ్యామిలీ డ్రామా కాబట్టి వెంకీ మామ సాలిడ్ హిట్ అందుకునే అవకాశం ఉంది.