భగీరధను అభినందించిన వెంకయ్య నాయుడు

సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు . మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూ లు , ఆయన తో వున్న అనుభవాలతో భగీరథ “మహానటుడు , ప్రజా నాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని వెలువరించాడు . ఈ పుస్తకాన్ని శుక్రవారం రోజు వెంకయ్య నాయుడు గారిని హైదరాబాద్ లో కలసి బహూకరించాడు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు . సినిమా రంగంలోనూ , రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని , ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు.
మహా నటుడు , ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మీద ఓ పుస్తకాన్ని వెలువరించిన జర్నలిస్ట్ , రచయిత భగీరధను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అభినందించారు .