నలుగురు అమ్మాయిలతో… వరల్డ్ ఫేమస్ లవర్

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రవికుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజబెల్లె లాంటి నలుగురు హీరోయిన్స్ పక్కన నటిస్తున్న సోలో హీరోగా నటిస్తున్న విజయ్, తన ఫిల్మ్ టైటిల్ ని రివీల్ చేశాడు. వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ, #WFL అనే హ్యాష్ ట్యాగ్ తో టైటిల్ పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

గతంలో రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో ఒక సీన్ లో తాను వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అన్నాడు, ఇప్పుడు విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ అంటున్నాడు. అయితే అక్కడ చరణ్ కి పది లవ్ స్టోరీస్ ఉంటే, ఇక్కడ రౌడీ హీరోకి నాలుగు ప్రేమ కథలు ఉండేలా ఉన్నాయి. నాలుగురమ్మాయిలతో మన వరల్డ్ ఫేమస్ లవర్ చేసే బోయే ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.