నేడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ బ‌ర్త్‌డే.. “గ‌ని”గా వ‌స్తున్నాడు!

మెగా హీరో వ‌రుణ్ తేజ్ గ‌ద్ద‌లకొండ గ‌ణేశ్ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న కొత్త సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. నేడు వ‌రుణ్‌తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. వ‌రుణ్ కెరీర్‌లో 10వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు గ‌ని టైటిల్ ఫిక్స్ చేశారు చిత్ర‌బృందం. బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

varuntej

కాగా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ సినిమాలో ఊర‌మాస్‌గా న‌టించిన వ‌రుణ్‌తేజ్ ఇప్పుడు బాక్స‌ర్‌గా ఎలా ఆక‌ట్టుకుంటాడో అన్న ఆస‌క్తి అంద‌రిలోను నెల‌కొంది. ఇక ఈ సినిమాకు కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. వ‌రుణ్‌తేజ్ జోడీగా స‌యి ముంజ్రేక‌ర్ న‌టిస్తోంది. అలాగే ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి, న‌వీన్‌చంద్ర ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌లను పోషిస్తుండ‌గా.. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు బాబీ, రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూవాట‌ర్ క్రియేటివ్ బ్యాన‌ర్స్‌పై సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.