Varuntej: గ‌ని వ‌చ్చేస్తోన్నాడు.. వ‌రుణ్ తేజ్ పోస్ట్‌..

Varuntej: మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ప్ర‌స్తుత చిత్రాల‌తో ఎంతో జోష్ మీదున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ‌రుణ్ న‌టించిన గ‌ని చిత్రం రిలీజ్ డేట్‌ను ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవ‌లే వ‌రుణ్‌తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 19న ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. బాక్సింగ్ రింగ్‌లో పంచులు కొడుతున్న Varuntej వ‌రుణ్ లుక్ అభిమానుల‌నే కాకుండా సినీ ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతగానో అల‌రించింది.

varun ghani

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర‌యూనిట్‌.. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వ‌రుణ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. జూలై 30న గ‌ని Varuntej రింగులో దిగ‌బోతున్నాడ‌ని త‌న సినిమా పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో Varuntejవ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు మ‌హేశ్ ముంజ్రేక‌ర్ కూతురు స‌యూ ముంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే Varuntej వ‌రుణ్‌కు ప్ర‌ముఖ న‌టుడు ఉపేంద్ర‌, కోచ్‌గా బాలీవుడ్ న‌టుడు సునీల్‌శెట్టి, విల‌న్‌పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.