Bollywood: ప్రేయ‌సిని వివాహ‌మాడిన బాలీవుడ్ యంగ్ హీరో!

Bollywood: బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఎట్ట‌కేల‌కు త‌న చిర‌కాల ప్రేయ‌సి న‌టాషా దలాల్ను వివాహ‌మాడారు. జ‌న‌వ‌రి 24న ఆదివారం బాంబేలోని మాన్స‌న్ హౌస్ రిసార్ట్‌లో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌లువురు Bollywood బాలీవుడ్ ప్ర‌ముఖులు, అతి కొద్ది మంది స‌న్నిహితులు హాజ‌రయ్యారు. తాజాగా ఈ పెళ్లి ఫోటోల‌ను వ‌రుణ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

తాజాగా పెళ్లిలో హ‌ల్దీ వేడుక‌కు చెందిన ఫోటోల‌ను వ‌రుణ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోలో వ‌రుణ్ ప‌సుపు రాసుకుని కండ‌లు చూపిస్తూ క‌నిపిస్తాడు.. Bollywood ఇక వ‌రుణ్ న‌టించిన కూలీ నం1 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.. ఈ చిత్రాన్ని వ‌రుణ్ ధావ‌న్ తండ్రి డేవిడ్ ధావన్ తెర‌కెక్కించారు.