బ్రేకింగ్: మరో మెగా హీరోకు కరోనా

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ కరోనా టెస్టు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, స్వల్ప కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని వరుణ్ తేజ్ స్వయంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, జాగ్రత్తలు తీసుకుంటున్నానని వరుణ్ తేజ్ చెప్పాడు.

VARUN TEJ

త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని వరుణ్ తేజ్ చెప్పాడు. ఇప్పటికే రాంచరణ్‌కు కరోనా రావడం, తాజాగా వరుణ్ తేజ్‌కి కూడా కరోనా రావడంతో.. మెగా ఫ్యామిలీలోని అందరూ కరోనా టెస్టు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎంతమందికి కరోనా పాజిటివ్ తేలిందనేది తెలియాలి.

ఇటీవల రాంచరణ్ ఇంట్లో జరిపిన క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌తో పాటు నిహారిక, చిరు కూతురు సుస్మితతో పాటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్, రాంచరణ్‌కు కరోనా సోకడంతో మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేగుతోంది.