వారెవా జతగాళ్లు సినిమా పోస్టర్ లాంచ్

ఈరోజు ఓం శివదత్త క్రియేషన్స్ బ్యానర్లో ప్రభాకర్, నాగబాబు, వీరబాబు సంయుక్తంగా సలాది సత్య దర్శకత్వంలో నిర్మించిన “వారెవా జతగాళ్లు” సినిమా పోస్టర్ లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె.వి.మోహన్ గౌడ్.. ఈ సందర్భంగా మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడ్జెట్ తో సంబంధం లేకుండా స్టోరీ బాగుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్ చేస్తున్నారని, ఈమధ్య రిలీజ్ అయి హిట్ అయిన బలగం సినిమా చిన్న సినిమాలకు నమ్మకం పెంచిందని ఈ వారెవ్వా జతగాళ్లు సినిమా కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్ మరియు ఎడిటర్స్ అసోసియేషన్ ట్రెజరర్ మేనగ శ్రీను, యువ దర్శకుడు మాల్యాద్రి…