Varalaxmi Sarathkumar: పుష్పలో ఛాన్స్ కొట్టేసిన వరలక్ష్మి

క్రాక్ , నాంది చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటి వరలక్ష్మి కు ఒక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఒక కీలక పాత్ర కోసం వరలక్ష్మి ని తీసుకున్నారని సమాచారం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మరియు తన నటనతో వరలక్ష్మి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానం సంపాదించుకున్నారు, ఇప్పుడు బన్నీ పక్కన నటిస్తుండడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

పుష్ప సినిమాలో అందాల భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.ఇప్పటికీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సాంగ్ షూట్ కి రెడీ అవుతున్నారని సమాచారం .