ప్రధాని నరేంద్ర మోడి గారిని కలిసిన హను-మాన్ సినిమా నటి

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడి గారిని కలిశారు. ఈమె నటనకు దక్షిణ సినీ రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవలే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన హను-మాన్ సినిమాలో ఈమె పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా నటించారు. అయితే ఇటీవలే ఆమె పెళ్లి నిశ్చయం అయిన సంగతి అందరికీ తెలిసిందే. కావుత తన వివాహానికి హాజరు కావాలని ఇప్పటికే అన్ని సినిమా రంగాల నుండి ఎందరో ప్రముఖ నటీనటులను ఆహ్వానించడం జరిగింది. అలాగే కొంత మంది రాజకీయ నాయకులను ఆహ్వానించడం జరిగింది. అదే తరహాలో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రధాని మోడీని కలిసేందుకు ఆమె తన తండ్రి శరత్ కుమార్, తల్లి రాధికా ఇంకా తనకు కాబోయే భర్త నీచోళై స్చదేవ్ తో కలిసి వెళ్లారు.