ఐదో బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కున్న హీరోయిన్

సెలబ్రెటీల లవ్ ఎఫైర్స్ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. ఒకరితో కొద్దిరోజులు డేటింగ్‌లో గడిపిన అనంతరం బ్రేకప్ చెప్పి, మరొకరితో లవ్ ఎఫైర్ నడపడం కామన్. ప్రతి ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఇలాంటి లవ్ ఎఫైర్స్ ఎన్నో ఉంటాయి. ఇక రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. తాజాగా ఒక హీరోయిన్ ఏకంగా ఐదోసారి ప్రేమలో పడింది.

VANITHA PRASAD

ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ వనిత విజయ్‌కుమార్. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవలే మూడో భర్తకు దూరం కాగా.. గతంలో నలుగురితో ప్రేమాయణం నడిపింది. ఇప్పుడు మరో వ్యక్తితో లవ్‌లో పడినట్లు తాజాగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇప్పుడు మీరు హ్యాపీనా’ అంటూ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. 2000లో నటుడు ఆకాష్‌ను వనిత పెళ్లి చేసుకుంది. ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన అనంతరం కొద్దిరోజులకే అతడికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2007లో ఒక బిజినెస్ మెన్‌ను పెళ్లి చేసుకుంది. ఇక ఐదేళ్లు కాపురం చేసిన తర్వాత ఆయనను వదిలేసింది. దీని తర్వాత డ్యాన్స్ మాస్టర్‌తో నాలుగేళ్లు డేటింగ్‌లో ఉంది. 2017లో అతడికి బ్రేకప్ చేప్పిన ఈ బ్యూటీ.. తాజాగా మరో వ్యక్తితో ప్రేమలో పడింది.