డిసెంబర్ 18న విడుదలకి సిద్ధమవుతున్న ‘వలస’ !!

సమకాలీన పరిస్థితులపై సినిమాలు అందించే పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కళా కార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘వలస ‘ సెన్సార్ కారిక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న “వలస” చిత్రం థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమయ్యింది.
ఈ చిత్ర విశేషాలను నిర్మాత యెక్కలి రవీంద్ర బాబు తెలియజేస్తూ… ‘కోవిద్ కారణంగా విధించబడ్డ లొక్డౌన్ వలన జీవనోపాధి, గత్యంతరం లేక రోడ్డున పడ్డ లక్షలాది వలస కార్మికుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని లొక్డౌన్ సమయంలోనే విశాఖ జిల్లా పరిసరప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగింది. చాలా కేసులు స్టడీస్ చేసి వాటి ఆధారంగా రెడీ చేసిన అద్భుతమైన ఈ కథలో ఎన్నో నిజ జీవితపు పాత్రలు సజీవంగా తెరపై ఆవిష్కరించబడ్డాయి. కేవలం వలస కార్మికులు నడిచిన వందల కిలోమీటర్ల ప్రయాణంలో పడ్డ కష్ట నష్టాల్నే కాకుండా వారి జీవితాల్లోని నవ్వుల్నీ, ప్రేమల్ని, మానవ సంబంధాలని హృద్యంగా చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేసామన్నారు.

చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్ , గౌరీ, చిన్నారి, తులసి రామ్, మనీషా, తనీషా, ఎఫ్ ఏం బాబాయ్, సముద్రం వెంకటేష్, మల్లికా, నల్ల శీను, రమణి, ప్రణవ్, సాజిద్ తదితరులు వలస కార్మికులుగా నటించగా, వారికి దారిలో తారసపడ్డ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో సన్నీ , వృత్తి ధర్మం పాటించే అగ్రెస్సివ్ పోలీస్ పాత్రలో వాసు. జర్నలిస్ట్ గా రామన్, కనిపిస్తారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించిన ఈ చిత్రంలో మనసుకి హత్తుకొనే పాటకి మనోహర్ సాహిత్యం అందించగా ధనుంజయ్ ఆలపించారు. నగరాలని నిర్మించిన వలస కార్మికుల్ని పరిస్థితులు అనాధలుగా వదిలేస్తే, వాళ్ళు వేసిన రోడ్లే వారిని తమ తమ పల్లెలకు తీసుకువెళుతుంటే వారిని అక్కున చేర్చుకున్న మానవత్వం ఈ చిత్రంలోని పాత్రలలో కనిపిస్తుంది… వారి కష్టాన్ని సైతం తమ ప్రచారాలకు వాడుకొనే పైశాచికత్వం కూడా కొన్ని పాత్రలలో కనిపిస్తుంది.
ప్రయాణంలో ప్రేమికులైన ఒక ప్రేమజంట, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం, ప్రియుడితో తనివితీరా మాట్లాడానికి ఫోన్ కూడా దొరకక తల్లడిల్లే ఒక ఒంటరి ప్రేయసి, నిండు నెలల గర్భంతో గూడు చేరుకోవడానికి ఆరాటపడుతున్న ఒక ఆడపడుచు, ఇలా ఎన్నో కధలు… అందరి ఆరాటం ఒక నీడకి చేరాలని, అందరి అడుగులు భవిష్యత్తు వైపు…ఇది కళ్ళ ముందు జరిగిన జీవితాన్ని తెరపై బందిచడానికి చేసిన ఒక ప్రయత్నం. మార్గినలైజ్డ్ సెక్షన్స్ కి చెందిన కధకి తెర రూపమే మా ఈ “వలస” చిత్రం అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్ : నరేష్ కుమార్ మడికి, , సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, కలరింగ్: శ్యాం కుమార్ పి, సౌండ్ ఎఫెక్ట్స్ : ప్రదీప్ చంద్ర , ఆడియోగ్రఫీ : కే పద్మ రావు, ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : బి బాపిరాజు కో ప్రొడ్యూసర్ : శరత్ ఆదిరెడ్డి, రాజా జి , నిర్మాత : యక్కలి రవీంద్ర బాబు, రచన, దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి