Powerstar: వ‌కీల్‌సాబ్ చిత్రానికి సెన్సార్ టాక్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో..శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం వ‌కీల్ సాబ్‌. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ పింక్ చిత్రానికి ఇది రీమేక్‌గా తెర‌కెక్కుతుంది. ఇందులో శ్రుతిహాస‌న్‌, అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య నాగేళ్ల‌, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు న‌టించిన చిత్రానికి ఎస్ ఎస్ త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.

Power

ఇప్ప‌టికే ఈచిత్రంకు సంబంధించించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను, ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో.. తాజాగా వ‌కీల్ సాబ్ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు U/A స‌ర్టిఫికేట్‌ను జారీ చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.