Vakeelsaab: బాబాయ్ ట్రైల‌ర్‌ను నేనే రిలీజ్ చేస్తా: ఫ్యాన్స్‌తో రాంచ‌ర‌ణ్

Vakeelsaab: రేపు మార్చి 27న మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు భారీ ఎత్తున అభిమానులు చేరుకుని అడ్వాన్స్ హ్యాపీ బ‌ర్త్‌డే అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో చ‌ర‌ణ్ వారివ‌ద్ద‌కు వ‌చ్చి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల‌ను పంచుకున్నారు. త‌న తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో సిద్ధ పాత్ర‌ను చేసిన విష‌యం తెలిసిందే. అయితే రేపు ఆచార్య‌లో నుంచి నా పాత్ర పోస్ట‌ర్ రిలీజ్ చేస్తార‌ని అభిమానుల‌తో పంచుకున్నారు చ‌ర‌ణ్‌.

Ramcharan

అలాగే త‌న బాబాయి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌ను నేనే సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేస్తా అనే స‌రికి అభిమానుల ఆనంద‌నికి అవధులు లేకుండా పోయాయి.. అభిమానుల కేరింత‌లు, విజిల్స్, చ‌ప్ప‌ట్లతో చెర్రీ నివాసం వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొన్నాయి. ఇక తాను న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి అల్లూరి సీతారామ‌రాజు పోస్ట‌ర్‌ను కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో దుమ్ముదులేపేస్తుంది.