పవన్ ఫ్యాన్స్‌కి బిగ్ గుడ్‌న్యూస్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో దీని షూటింగ్ ముగియగా.. ఇందులో శృతిహాసన్, అంజలి కీలక పాత్రలలో నటించారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరెక్కించారు.

#VakeelSaabTeaser JAN 14Th

తాజాగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి వకీల్ సాబ్ యూనిట్ గుడ్‌న్యూస్ తెలిపింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సాయంత్రం 6.03 గంటలకు వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై బోనీ కపూర్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.