వ‌కీల్‌సాబ్ సాంగ్స్ అప్‌డేట్ త్వ‌ర‌లో: ఎస్.ఎస్‌.త‌మ‌న్

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ నుంచి ఓ అప్‌డేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ద్వారా ల‌భించింది. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో Powerstarప‌వ‌న్‌క‌ళ్యాన్ స‌ర‌స‌న శృతిహాస‌న్‌ మూడోసారి హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఇందులో అంజ‌లి, నివేధాథామ‌స్, అన‌న్య నాగ‌ళ్ల‌ త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

vakeelsaab songs

అయితే ఇప్ప‌టికే రిలీజ్ అయినా టీజ‌ర్‌, పోస్ట‌ర్ల్ ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా ఈ సినిమానుంచి మ‌గువా మ‌గువా సాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్ర‌బృందం.. ఈ పాట ఎంతోగానో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. కాగా తాజాగా ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. త‌మ‌న్ ట్విట్ట‌ర్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం చెప్పాడు. Powerstarవ‌కీల్‌సాబ్ పాట‌ల విడుద‌ల ఎప్పుడ‌నేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తాన‌ని ట్వీట్ చేశారు. ఈ చిత్ర‌క‌థాంశం మ‌హిళా ప్రాధాన్య చిత్ర‌మిది.. అందుకే మార్చి 8న మ‌హిళా దినోత్స‌వం కానుక‌గా వ‌కీల్‌సాబ్ నుంచి పాట‌లు రిలీజ్ చేస్తుంటార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. కాగా Powerstarఈ చిత్రం బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్‌గా వ‌స్తుందనే విష‌యం తెలిసిందే.