Vakeelsaab: వాలంటైన్స్ డే కానుకగా ప‌వ‌న్‌-శ్రుతి రొమాంటిక్ సాంగ్‌‌..

Vakeelsaab: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్- శ్రుతి హాస‌న్ కలిసి మూడోసారి జోడీగా రాబోతున్న చిత్రం వ‌కీల్‌సాబ్‌. వీరిద్ద‌రి క‌ల‌యికగా వ‌చ్చిన చిత్రాలు గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు లోని స‌న్నివేశాలు గానీ, పాటలుగానీ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అమితంగా ఆక‌ట్టుకున్నాయి. Vakeelsaab ఇక వ‌కీల్‌సాబ్‌ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

second song

అలాగే ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని తొలి పాట మ‌గువా మ‌గువా అంటూ సాగే పాట ప్రేక్ష‌కులను ఫిదా చేసింది.. ముఖ్యంగా ఆడ‌వారికి ఎంతో ధైర్య‌నిచ్చింది ఈ సాంగ్‌.. ఇక Vakeelsaab ఈ సినిమాలోని రెండో పాట గురించి తెలిపాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌.. థ‌మ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా.. ప‌వ‌న్-శ్రుతి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఒక ల‌వ్ సింబ‌ల్ పెట్టి.. ఫిబ్ర‌వరి 14న రాసుకొచ్చారు. దీంతో వ‌కీల్‌సాబ్ నుంచి రాబోతున్న మ‌రో పాట‌ను వాలంటైన్స్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇది ప‌వ‌న్-శ్రుతి రొమాంటిక్ సాంగ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక Vakeelsaab ఈ చిత్రంలో అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌గా.. ఏప్రిల్ 9న ఉగాది కానుక‌గా ఈ Vakeelsaab సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించారు.‌