Powerstar: ప‌వ‌న్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌.. వ‌కీల్‌సాబ్ ప్రీరిలీజ్‌కు పోలీసుల నిరాక‌ర‌ణ‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్ సాబ్ త్వ‌ర‌లో థియేట‌ర్ల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ముందుగా ప్ర‌మోష‌న్స్ భాగంగా ప్రీరిలీజ్ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి చిత్ర‌బృందం రెడీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 3న యూస‌ఫ్ గూడ‌లోని పోలీసు గ్రౌండ్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రీరిలీజ్ వేడుక‌ల కోసం జే మీడియా ప్ర‌తినిధులు జూబ్లీహిల్స్ పోలీసుల‌ను అనుమ‌తి కోరారు. అయితే కొవిడ్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ వేడుక‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని పోలీసులు తేల్చిచెప్పారు.

Vakeelsaab

ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడేళ్ల త‌ర్వాత న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.. ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ ఆ అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ ను మ‌రింత భారీగా చేయాల‌ని ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రుతి హ‌స‌న్‌, అంజ‌లి, నివేధా థామ‌స్‌, అన‌న్య నాగేళ్ల‌, ప్ర‌కాశ్‌రాజ్ త‌దిత‌రులు న‌టించిన చిత్రానికి ఎస్ ఎస్ త‌మ‌న్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.