Tollywod: ప‌వ‌ర్‌స్టార్ చేతిలో ఎర్ర కండువా, మాస్ మ‌హారాజ్ చేతిలో తుపాకీ.. ఎట్టా ఉంది!

Tollywod: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్‌. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌స్తుండ‌గా.. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వేణు శ్రీ‌రామ్‌.. ప‌వ‌ర్‌స్టార్ కోసం మాస్ ఎలిమెంట్స్ ఉన్నా స‌న్నివేశాల‌ను ఎక్కువ‌గా తీశారు. ఈ సినిమాను దిల్‌రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే సినిమాలో ప‌వ‌న్‌క‌ళ్యాన్ స‌ర‌స‌న మూడోసారి శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. Tollywod ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల్‌,

power mass

తాజాగా విడుద‌లైన రిలీజ్ పోస్ట‌ర్‌తో అభిమానుల‌నే కాకుండా సినీ ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేసింది. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమాకు సంబంధించి టీజ‌ర్ ప‌వ‌న్ అభిమానుల్లో ఎంతోగానో అల‌రింప‌జేసింది. ఇక తాజాగా వ‌కీల్‌సాబ్‌ విడుద‌ల తేదీతో పాటు కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన చిత్ర‌బృందం.. ప‌వ‌ర్‌స్టార్ ఎర్ర కండువా, ర‌క్త‌పు మ‌ర‌క‌ల చొక్కాతో క‌న‌ప‌డుతూ త‌న ఉగ్ర‌రూపాన్ని చూపాడు. ఇక Tollywod ఈ సినిమా ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు… ఇక మాస్ మ‌హారాజ్ ఖిలాడీ సినిమా గురించి.. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ గ‌త కొంత‌కాలంగా త‌న సినిమాలు స‌రిగ్గా ఆడ‌లేదు. దీంతో పాత‌ ర‌వితేజను మ‌ర్చిపోయారు. కానీ ఇటీవ‌లే సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన క్రాక్ చిత్రంతో ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మాస్ మ‌హారాజ్ మంచి జోష్ మీదున్నాడు. అయితే తాను న‌టిస్తున్న ప్ర‌స్తుత చిత్రం ఖిలాడీ.. ఈ సినిమా నుంచే ఇటీవ‌లే ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌వ‌గా.. ర‌వితేజ అభిమానుల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. ఈ సినిమాలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఇక తాజాగా Tollywod ఈ సినిమా విడుద‌ల తేదీని రిలీజ్ చేసింది. మే 28న ఈ సినిమా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. అలాగే కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ర‌వితేజ న‌ల్ల‌రంగు కోటులో, చేతిలో తుపాకీతో ఆయ‌న క‌న‌ప‌డుతున్నాడు. ఇక ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి హీరోయిన్ల్‌గా న‌టిస్తుండ‌గా.. డా. జ‌యంతిలాల్ గ‌డ స‌మ‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ ప‌తాకాల‌పై రూపుదిద్దుకుంటుంది. ఇక దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.