Powerstar: వ‌కీల్‌సాబ్‌లో ఐటెం సాంగ్‌కు చిందేయ‌నున్న ‌జ‌బ‌ర్ద‌స్త్‌ యాంక‌ర్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ నటించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ నుంచి స‌రికొత్త ఓ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ప‌వ‌న్ రీఎంట్రీ ఇస్తున్న వ‌కీల్‌సాబ్‌లో ఐటెం సాంగ్ ఉంటుంద‌ట‌.. ఈ సాంగ్‌లో జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ ప‌వ‌ర్‌స్టార్‌తో చిందేయ‌నుందాట‌. ప్ర‌స్తుతం ఈ వార్తా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ న‌డుస్తోంది.

vakeelsaaab movie

ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిస్తుండ‌గా.. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ చిత్రానికి ఈ చిత్రం రీమేక్‌గా వ‌స్తుండ‌గా.. Powerstar ప‌వ‌న్ కోసం ఈ చిత్రంలో ప‌లు మార్పులు చేశార‌ట‌.. యాక్ష‌న్ సీన్స్‌, శ్రుతిహాస‌న్ సీన్స్‌, ఇందులో భాగంగానే ర‌ష్మీ ఐటెం సాంగ్ ఇలా మార్పులు చేశార‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రంలో అంజ‌లి, నివేధా థామ‌స్‌, ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్‌ ఈ చిత్రానికి స్వ‌రాలు అందించ‌గా.. ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న Powerstar వ‌కీల్‌సాబ్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక విడుద‌ల‌కు ముందే వ‌కీల్‌సాబ్ డిజిట‌ల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ 25కోట్ల రూపాయ‌ల‌కు అమ్ముడుపోయిన‌ట్టు.. అలాగే శాటిలైట్ రైట్స్ రూ.15కోట్ల‌కు జీ తెలుగు కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ చిత్రం కోసం ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త‌న అభిమాన న‌టుడు Powerstar న‌టించిన వ‌కీల్‌సాబ్‌ సినిమా మంచి విజ‌య‌వంతం కావాల‌ని ప‌వ‌న్ అభిమానులు కోరుకుంటున్నారు.