Vakeelsaab: బాలీవుడ్ లెజండరీ నటుడు సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో.. హాట్ బ్యూటీ తాప్సీతో పాటు ఫలక్, ఆండ్రియా మహిళా ప్రధాన పాత్రల్లో పింక్ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని విక్కీడోనర్, మద్రాస్ కేఫ్ లాంటి సందేశాత్మక చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ శూజిత్ సర్కార్ నిర్మాణంలో.. అనిరుద్ధ రాయ్ చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో తాప్సీ న్యాయం కోసం పోరాడే ఓ రేప్ బాధితురాలిగా ప్రేక్షకులను ఎంతో మెప్పించింది.. పింక్ చిత్రం ఎలా ఉంటుందంటే ఈ సమాజంలో మనుషులు అమ్మాయిలపై ఏ రకంగా చూస్తున్నారు? అదే అబ్బాయిలపై ఏ రకంగా చూస్తున్నారు అనేది ఈ చిత్రంలో్ చూపించారు. ఇక ఇందులో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో కోర్టు సన్నివేశాలు చాలా కట్టుదిట్టంగా, ఆసక్తికరంగా సాగుతాయి .. దీంట్లో లాయర్‌గా బిగ్‌బి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘన విజయం సాధించింది.. దీంతో ఈ చిత్రం రీమేక్ హక్కులపై మనుసు పడ్డారు దర్శక నిర్మాతలు.. చివరికి అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్ రీమేక్ రైట్స్‌ను భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నారు.
మొదటగా తమిళ్‌లో నెర్కొండ పార్వాయిగా తాలా అజిత్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని తెలుగులో బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ ప్రధాన పాత్రలో వకీల్ సాబ్‌గా రూపొందించారు.. … అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు ఆ పాత్ర సరిపోదని వార్తాలు రావడంతో పవన్ ఫ్యాన్స్‌ల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే డైరెక్టర్ శ్రీ రామ్ వేణు కథకు డ్యామేజ్ కలగకుండా పవన్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు బిగ్‌బి క్యారెక్టర్‌ను కొత్తగా మార్పులు చేశారు. హిందీలో బిగ్‌బి, తమిళ్‌లో అజిత్ ఓల్డ్ ఏజ్ లుక్‌లో కనిపించారు.. కానీ యూత్‌స్టార్ అయినా పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ ఈ చిత్రంలో ఓల్డ్ ఏజ్ లుక్‌లో కనిపించకుండా యంగ్ లుక్‌లో కనిపించి తనదైన శైలిలో పాత్రను పోషించాడు. ఇందులో భాగంగానే వకీల్‌సాబ్ క్యారెక్టర్‌కు ఒక ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను శ్రుతిహాసన్‌తో దర్శకుడు క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ చూస్తుంటే మాస్ ఎలిమెంట్స్.. ఎమోషనల్, సందేశాత్మకం అంశాలు వకీల్ సాబ్ చిత్రంలో పుష్కలంగా ఉంటాయని అర్థం అవుతుంది. ఇక తొలి సారి లాయర్ పాత్రల్లో పవన్ తెరపై ఏ విధంగా అలరిస్తాడని సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. హిందీలో టాలెంట్ నటీ తాప్సీ పన్ను పోషించిన ప్రధాన పాత్రను తెలుగులో నివేధా థామస్ చేయగా.. ఆమెతో పాటు అంజలి, అనన్య నాగేళ్ల సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు.. ఒకవైపు రాజకీయాలు చేస్తూ.. మరో వైపు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వకీల్ సాబ్ చిత్రం మహిళల కథాంశంతో తెరకెక్కుతుండడంతో.. రాజకీయంగా పవన్‌కు ఎంతో ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.