పవన్ అభిమానులకు దీపావళి గిఫ్ట్ అందేనా?

ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఇటీవల తిరిగి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు పవర్ స్టార్ మెట్రోలో పవన్ ప్రయాణించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన విషయం తెలిసిందే. ఇక బ్లాక్ షర్ట్‌తో సినిమా షూటింగ్‌లో పవన్ ఉన్న ఫొటోలు కూడా వైరలయ్యాయి.

ఇప్పటికే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా.. దీపావళి కానుగా ఈ సినిమా టీజర్ విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుందట. వకీల్ సాబ్ రికార్డింగ్ సెషన్‌లో బిజీగా ఉన్నట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశాడు. దీంతో వకీల్ సాబ్ టీజర్‌ను ప్రిపేర్ చేసే పనిలో సినిమా యూనిట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేథా థామస్, అంజలీలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.