పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి వకీల్ సాబ్ సినిమా యూనిట్ పవన్ అభిమానులను సర్‌ప్రైజ్ ఇచ్చింది. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పవన్ రాయల్ ఎన్ ఫీల్డ్ లేటెస్ట్ మోడల్ బుల్లెట్ నడుపుతుండగా. .. వెనుక శృతిహాసన్ నవ్వుతూ కనిపించింది. పవన్, శృతిహాసన్ నవ్వుతూ కనిపించారు.

Vakeel Saab teaser Sankranthi

ఈ సందర్భంగా వకీల్ సాబ్ యూనిట్ మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో పవన్ అభిమానులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. తాజా పోస్టర్ చూస్తుంటే పవన్, శృతిహాసన్ మధ్య రోమాన్స్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. మరోసారి ఈ జోడీ ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది.

వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.