‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత నటించిన సినిమా ‘వకీల్ సాబ్’. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన వకీల్ సాబ్ టీజర్ అభిమానులను అలరించింది. మూడేళ్ల తర్వాత పవన్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో.. దీని కోసం పవన్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు. ఇందులో అంజలి, నివేదా థామస్, శృతిహాసన్ కీలక పాత్రలలో నటించారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే విడుదలైన మగువా.. మగువా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.