“ఉత్తమ కలి పురుషుడు” చిత్రానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది!!

సింగ పెరుమాళ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం “ఉత్తమ కలి పురుషుడు”. ఈ లాక్ డౌన్ లో థియేటర్స్ ప్రాబ్లమ్ ఉన్నందున గత నెల మార్చి 26న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లైన ఎంఎక్స్ ప్లేయర్ , మరియు అమెజాన్ ఓవర్సీస్ (యు ఎస్, యూకే),ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామా లలో రిలీజ్ చేశాము. ఓటీటీ లో మాకు మంచి పేరు వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని కైవశం చేసుకొని మంచి స్పందనతో దూసుకుపోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు సందీప్ పొడిశెట్టి, నందకిషోర్ పసుపాల సినిమా గురించి మాట్లాడుతూ …థియేటర్స్ లలో సినిమా రిలీజ్ అయ్యి మాకు మంచి పేరు వచ్చింది. ఈ లాక్ డౌన్ వలన థియేటర్స్ లేవు.ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లైన ఎంఎక్స్ ప్లేయర్ , అమెజాన్ ఓవర్సీస్ (యు ఎస్, యూకే), ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామా లలో రిలీజ్ చేశాము. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కూడా మాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నటీనటులు
నందు, రుచిర, సుధ, యశ్వంత్, శ్రావణ్, పవన్, సాయి, విక్కీ లు నటించారు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- సింగ పెరుమాళ్ క్రియేషన్స్
సినిమా :- “ఉత్తమ కలి పురుషుడు”.
నిర్మాతలు :- నందకిషోర్ పసుపాల, సందీప్ పొడిశెట్టి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం :- సందీప్ పొడిశెట్టి
సంగీతం :-శశాంక్ భాస్కరుని
సాహిత్యం :- సురేష్ కడారి
సినిమాటోగ్రఫీ :- తాజ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ :- జునైద్ కుమార్
ఎడిటర్ :- ప్రణీత్
కొరియోగ్రఫీ :- ఆయుష్
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్