Uppena: తొలిసినిమాతోనే దుమ్ముదులిపాడు వైష్ణ‌వ్‌తేజ్‌..

Uppena: మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మ‌రో హీరో వైష్ణ‌వ్‌తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇందులో త‌మిళ ప్ర‌ముఖ న‌టుడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి న‌టించ‌గా.. Uppena వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. కాగా ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.

తాజాగా ఈ సినిమా డే1 ప్ర‌పంచ‌వ్యాప్తంగా షేర్ల వివ‌రాలు వెల్ల‌డించారు మైత్రీ మూవీ మేక‌ర్స్‌. 10.42 కోట్ల షేర్‌తో సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఉత్త‌మ డెబ్యూ ఓపెనింగ్‌ల Uppena హీరోగా వైష్ణ‌వ్‌తేజ్ రికార్డు సృష్టించాడు. ఇక ఈ సినిమా ఏరియావైజ్‌గా గ‌మ‌నిస్తే.. Nizam- 3.08 కోట్లు, Vizag- 1.43కోట్లు, East- 0.98,West- 0.81కోట్లు, Krishna- 0.62కోట్లు, Guntur- 0.65కోట్లు, Nellore- 0.35కోట్లు, Ceded- 1.35కోట్లు, AP +TG Total 9.3కోట్ల షేర్ వ‌సూలు కాగా అదేవిధంగా Overseas 34 L, Karnataka- 52 L, TN -16 L, ROI- 10 L వ‌సూల్ చేసింది. Uppena బ్రేక్ ఈవెన్ మార్క్‌ను సాధించ‌డానికి సుమారు రూ.22కోట్ల షేర్ వ‌సూలు చేయాల్సి ఉంది. అయితే వంద శాతం ఆక్యుపెన్సీతో ఈ వ‌సూళ్లు తొలి వికెండ్ నాటికే అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.