Uppena: ఉప్పెన వారం కలెక్ష‌న్స్ అదుర్స్‌..

Uppena: మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన మ‌రో హీరో వైష్ణ‌వ్ తేజ్‌.. ఆయ‌న న‌టించిన డెబ్యూ చిత్రం ఉప్పెన.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో హీరోయిన్‌గా కృతిశెట్టి న‌టించ‌గా.. విల‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ కొలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి న‌టించాడు. Uppenaఈ చిత్రంలో హీరోహీరోయిన్ల సీన్స్‌, ముఖ్యంగా విల‌న్ పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్‌తో ప్రేక్ష‌కులు ఎంతో ఎమోష‌న‌ల్ కు గుర‌య్యారు.

Uppena collections

ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ఇప్ప‌టికీ కూడా దూసుకెళ్తుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌లో అత్య‌ధిక షేర్ వ‌సూల్ చేసిన డెబ్యూ హీరోగా వైష్ణ‌వ్‌తేజ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక Uppenaఈ చిత్రం గ‌త శుక్ర‌వారం విడుద‌లై మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. మొత్తం మీద వారం రోజుల క‌లెక్ష‌న్ల‌ను చూసుకుంటే.. దాదాపు 38కోట్ల షేర్ వ‌సూల్ చేసినట్లు ట్రేడ్ వ‌ర్గాలు నుంచి స‌మాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప్పెన 6వ రోజు 1.93కోట్లు రాగా, 7వ రోజు 1.44కోట్ల షేర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. దీంతో నైజాం ఏరియా 11.55కోట్లు, సీడెడ్‌లో 5.60కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 34.91కోట్ల షేర్ రాబ‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 37. 91కోట్ల షేర్ సొంతం చేసుకుంది Uppenaఉప్పెన చిత్రం.