Uppena First Day Collections: ‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాక్.. ఇదే రికార్డు

Uppena First Day Collections: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ శుక్రవారం విడుదలై హిట్ టాక్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో.. సినిమాపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఉప్పెన సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. రోటిన్ ప్రేమ కథ అయినా.. స్క్రీన్ ఫ్లే విభిన్నంగా ఉండటం, నెగిటివ్ రోల్‌లో విజయ్ సేతుపతి నటన అందరినీ ఆకట్టుకుంది.

uppena first day collections

దీంతో తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.10.42 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో రూ.0.98 కోట్లు, రూ.0.81 కోట్లు రాబట్టింది. దీంతో డెబ్యూ హీరోగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా వైష్ణవ్ తేజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడం కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.

కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి

నైజాం.. రూ.3. 08 కోట్లు
►వైజాగ్ రూ. 1. 43 కోట్లు
►ఈస్ట్ రూ. 0.98 కోట్లు
► వెస్ట్ రూ. 0.81 కోట్లు
► క్రిష్ణా రూ. 0.62 కోట్లు
► గుంటూరు రూ. 0.65 కోట్లు
► నెల్లూరు రూ. 0.35
► ఏపీ మొత్తం రూ. 4. 87 కోట్లు
► సీడెడ్ రూ. 1. 35 కోట్లు
► నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు
►‌ర్ణాట‌క‌ రూ.52 ల‌క్ష‌లు
►త‌మిళ‌నాడు రూ.16 ల‌క్ష‌లు
►ఓవ‌ర్ సీస్లో రూ.34 ల‌క్ష‌లు