‘గని’లో కన్నడ స్టార్ హీరో?

వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ‘గని’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. బాక్సింగ్ స్పోర్ట్స్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాను జూలై 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

UPENDRA IN GHANI MOVIE

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఫిబ్రవరి 12న ఈ సినిమా షూటింగ్‌లో ఉపేంద్ర పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఇందులో ఉపేంద్రది కీలక పాత్ర అని టాక్. ఇటీవలే సినిమా యూనిట్ ఉపేంద్రను సంప్రదించి స్టోరీ గురించి వివరించగా.. ఇందులో నటించేందుకు ఉపేంద్ర ఒకే చెప్పాడట. సిద్దు , అల్లు బాబీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది.