Upasana: ఉపాస‌న చేతుల మీదుగా నాట్యం పోస్ట‌ర్ రిలీజ్‌!

Upasana: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ముద్దుల స‌తీమ‌ణి ఉపాస‌న శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో నాట్యం అని ఓ పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో నాట్యం అంటే ఏంటీ అని సోష‌ల్ మీడియాలో స‌స్పెన్స్ క్రియేట్ చేశారు.. నాట్యం అంటే ఒక క‌థ‌ను అందంగా చెప్ప‌టం అంటూ పేర్కొన‌డ‌మే కాదు శ‌నివారం ఉద‌యం అదేంటో చెబుతాన‌ని పేర్కొన్నారు. ఈ రోజు ఆ సస్పెన్స్‌కు తెర‌దించారు. వివ‌రాల్లోకి వెళితే..

Natyan fist look

కూచిపూడి నృత్యం ఆధారంగా రాబోయే ఇన్స్పిరేష‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న నాట్యం చిత్రం యొక్క ఫ‌స్ట్ లుక్ Upasana ఉపాస‌న రిలీజ్ చేసింది. హైద‌రాబాద్‌కు చెందిన సుప్ర‌సిద్ధ కూచిపూడి న‌ర్త‌కి సంధ్య‌రాజు ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. నాట్య భంగిమ‌తో ఉన్న‌సంధ్య‌రాజు పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతోగానో ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని రేవంత్ కొరుకండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డమే కాకుండా ర‌చ‌న‌-ఎడిటింగ్ వ‌ర్క్‌- సినిమాటోగ్రాఫ‌ర్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవానా త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాట్యం చిత్రాన్ని నిష్రింకాల ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతుండ‌గా.. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సంధ్య‌రాజుకు డెబ్యూ మూవీ.. కాగా శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.