ఉపాసన తల్లి సాహసం.. సైకిల్‌పై 642 కిలోమీటర్లు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన తల్లి శోభనా కామినేని అరుదైన రికార్డు సృష్టించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించి 6 రోజుల్లో 642 కిలోమీటర్లు ఉన్న చెన్నైకి చేరుకున్నారు. ఈ నెల 25న ఉదయం హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ నుంచి సైకిల్‌పై బయలుదేరి నిన్న చెన్నైకి చేరుకున్నారు. చెన్నైలోని తన తండ్రి ప్రతాప్ సి రెడ్డిని కలుసుకున్నారు.

UPASANA MOTHER CYCLE

అక్కడే తన 60 పుట్టినరోజుని ఆమె జరుపుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో కూడా ఆమె ఇలా సైకిల్‌పై ఈ సాహస యాత్ర చేయడం గ్రేట్ అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన తల్లి ఈ ఫీట్ సాధించినందుకు గర్వంగా ఉందని ఉపాసన నేర్కొంది. ఇక సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని ఉపాసన తల్లి శోభనా కామినేని తెలిపారు.

ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్ పర్సన్‌గా శోభనా కామినేని ఉన్నారు. ఈ ఫీట్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.