ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ మలయాళ, తమిళ నటుడు ఉన్నికృష్ణన్ నంబూతిరి కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. కొన్నిరోజులుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. ఆయన మృతికి పలువురు మలయాళ, తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Unnikrishnan Namboothiri died

జయరాశ్ దేశదనం అనే సినిమాతో ఉన్నికృష్ణన్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. మలయాళంలో 15 సినిమాల్లో ఆయన నటించారు. ఇక తమిళంలో కండుకొండైన్ కండుకొండైన్, పమల్ కె సమ్మండం, చంద్రముఖి లాంటి సినిమాలలో ఉన్నికృష్ణన్ కనిపించారు