‘ఖిలాడి’ మేకర్స్ నుంచి మరో అనౌన్స్‌మెంట్

ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాతో విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడీ సినిమాలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. మే 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

unni mukundan khiladi movie

ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలలో నటిస్తున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఖిలాడి సెట్‌లో అర్జున్ అడుగుపెడుతున్న ఒక ఫొటోని మేకర్స్ విడుదల చేశారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఇందులో నటుడు ఉన్ని ముకుంద‌న్ నటించనున్నట్లు మేకర్స్ ఇవాళ ప్రకటించారు. గతంలో జనతా గ్యారేజ్ సినిమాలో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించాడు.