Thamilnadu: ఏనుగును దారుణంగా కొడుతున్న‌ రాక్ష‌సులు.. జంతుప్రేమికులు ఆగ్రహాలు!

Thamilnadu: జంతువుల‌పై దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. మ‌రోవైపు మూగ‌జీవాలంటే అంద‌రికీ ప్రాణ‌మే. అయితే కొన్ని జంతువులు మ‌నుషుల‌పై దాడి చేస్తుంటే వాటి బారినుంచి త‌మ ప్రాణాల‌ను కాపుడుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అవి మృతిచెంద‌డం జ‌రుగుతోంది. తాజాగా Thamilnaduత‌మిళ‌నాడులోని శ్రీ‌విల్లిపూత్తురులో ఆండాళ్ ఆల‌యంలో జ‌య‌మాల్య‌త అనే ఏనుగు సేవ‌లందిస్తోంది. ఇది ఆడ ఏనుగు.

elephant news

అయితే ఈ ఏనుగు చెప్పిన మాట విన‌డంలేదంటూ ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ ఏనుగును తీవ్రంగా కాళ్ల ద‌గ్గ‌ర కొడుతున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో జంతుప్రేమికులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హాజ్వాల‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఏనుగుపై ఇద్ద‌రు వ్య‌క్తులు క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. పాపం ఆ మూగ‌జీవి ఘీంకారాలు పెట్టిందే త‌ప్ప తాను అనుభ‌విస్తున్న బాధ‌ను మాత్రం చెప్ప‌లేక‌పోయింది. దీనిపై జంతుప్రేమికులు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేయ‌గా.. Thamilnaduహిందూ రెలిజియ‌స్ అండ్ చారిట‌బుల్ ఎండోమెంట్స్ విభాగం అధికారులు స్పందించారు. ఆ వీడియోను తాము కూడా చూశామ‌ని, వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారిని అరెస్ట్ చేశార‌ని తెలిపారు.