తులసి కృష్ణ ఆడియో లాంచ్

tulasi krishna movie

అన్న పూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్ సహకారంతో సంచారి విజయ్ కుమార్, మేఘాశ్రీ హీరో హీరోయినులుగా , S.A.R. డైరెక్షన్లో , యం.నారాయణ స్వామి, శ్రీమతి నాగ లక్ష్మి నిర్మాతలుగా, డాక్టర్ మహేంద్ర సహనిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం తులసి కృష్ణ. ఇది కన్నడంలో రిలీజ్ అయి అఖండ విజయం సాధించిన కృష్ణ తులసి చిత్ర అనువాద చిత్రం.ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్మాతల మండలి హాలులో సినీ పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ . డైరెక్టర్ సాగర్ , మోహన్ గౌడ్ , సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది.

తమ్మారెడ్డి భరద్వాజ గారు ఆడియో సీడీని లాంచ్ చేసి మొదటి సీడీని డైరెక్టర్ సాగర్ గారికి అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లడుతూ హృదయాన్ని కదలింప చేసే ఇలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకొనే ఈ రోజుల్లో అందుడైన హీరో మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో డైరెక్టర్ అద్భుతంగా హ్యాండిల్ చేసాడని కొనియాడాడు.

డైరెక్టర్ సాగర్ గారు మాట్లాడుతూ: కనులతో ప్రేమించే ప్రేమ కన్నా మనసుతో ప్రేమించే ప్రేమే గొప్పదని అభివర్ణించారు. సాయి వెంకట్ మాట్లాడుతూ చిత్రం లోని ప్రతి సన్నీవేశం అద్భుతంగా ఉందని కొనియాడారు. మోహన్ గౌడ్ మాట్లాడుతూ సినిమా లోని అన్ని సాంగ్స్ మనసుకు హత్తు కునేలా ఉన్నాయని ప్రశంసించారు.

డైరెక్టర్ S.A.R. మాట్లాడుతూ: కథా బలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని , కన్నడ కన్నా తెలుగులో ఈ సినిమా గొప్ప విజయం సాదిస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.కో ప్రొడ్యూసర్ డాక్టర్ మహేంద్ర మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మిలి దీవించ దానికి వచ్చిన పెద్ద లందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపు తున్నానని, ఒక మంచి సినిమాను తెలుగు వారికీ అందించాలని ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నానని తెలియ జేశారు.