‘టుక్ టుక్’ సినిమా రివ్యూ

ఫాంటసీ, మ్యాజికల్‌ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలు ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కార్తిక్ సాయి కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చెయగా అశ్వంత్ శివకుమార్ ఎడిటర్ గా పని చేశారు. ఈ చిత్రానికి సంతు ఒంప్కర్ సంగీతాన్ని అందించారు. ఈరోజు మార్చి 21న ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
చిత్తూరు జిల్లాలో ఓ చిన్న గ్రామంలో ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు సరదాగా తిరుగుతూ జీవితాన్ని జల్సా చేస్తూ ఉంటారు. రోజంతా బూతు బొమ్మలు చూడటం ఇంకా అలాగే కొన్ని అసాంఘిక చర్యలు చేయడం వారి డైలీ రొటీన్. ఇది ఇలా ఉండగా వారు దానిపై డబ్బులు సంపాదించాలనుకుంటారు. క్రమంలో వాళ్ళు డబ్బు సంపాదించేందుకు వినాయక చవితి పండుగ కార్యక్రమాన్ని వారే చేసి డబ్బు మిగిల్చుకుని తద్వారా వారు అనుకున్న మార్గంలో డబ్బు సంపాదించే ఆలోచనలు తమ దగ్గర ఉన్న ఒక పాత స్కూటర్ను బాగు చేసి టుక్ టుక్ అని ఆ బండిని పిలుస్తారు. ఇది ఇలా ఉండగా ఆ బండి దానంతట అదే స్టార్ట్ కావడం అలాగే కదలడం వంటివి గ్రహించి ఆ టుక్ టుక్ బండిలో ఆత్మ ఉందని నిర్ధారిస్తారు. అయితే ఆ టుక్ టుక్ బండిలో ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ బండిలోకి ఎలా వస్తుంది? ఆ ఆత్మకు వీరికి సంబంధం ఏంటి? ఆ టుక్ టుక్ బండి వల్ల వీడి జీవితాల్లో వచ్చే మార్పులు ఏంటి? చివరకు ఏం జరుగుతుంది? అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించిన నిహాల్ కోదంటి ఇప్పటికే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకా హీరోగా నటించడం జరిగింది. దేవరలో చిన్న అగ్ర చేసినప్పటికీ అందరికీ గుర్తుండిపోయే విధంగా ఆ పాత్ర ఉండటం గమనార్హం. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తన పర్ఫామెన్స్ తో అందరిని మెప్పించాడు. అలాగే శాన్వి మేఘన హీరోయిన్గా రాణిస్తూ తన చక్కటి పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు టీనేజర్స్ పాత్ర నటించడం జరిగింది. హర్ష రోషన్ ఇప్పటికే సలార్, కోర్ట్ వంటి పలు చిత్రాలలో నటించారు. కార్తికేయ దేవ్ కూడా సలార్ ఇంకా మంచి పాత్ర పోషించారు. విడుదల తో పాటు స్టీవెన్ మధు కూడా పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించడం జరిగింది. అయితే టీనేజర్ కుర్రాళ్ళుగా వీరు చిత్రంలో చేసిన సందడి అంతా అంతా కాదు. అలాగే దయానంద్ రెడ్డితో పాటు ఇతర నటీనటులు వారి పాత్రలకు తొక్కట్లు తమ తమ పరిధిలో నటిస్తూ సినిమాకు ప్లస్ గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ :
చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండా తమ బడ్జెట్ పరిధిలో తాము అనుకున్నా అవుట్ కుట్టు బయటకు తీసుకు రావడంలో నిర్మాత ఇంకా దర్శకుడు సక్సెస్ అయ్యారు. దర్శకుడు సుప్రీత్ కృష్ణ తాను అనుకున్న ఈ కొత్త కోనపు కథను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. మంచి నిర్మాణ విలువల గల చిత్రంగా చక్కటి క్వాలిటీ అవుట్ ఫుట్ తో అటు సంగీతం అలాగే కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎక్కడా తగ్గకుండా సినిమా ఉంది. చిత్రంలో నటించిన ప్రతి నటీనటులకు వారి రోల్ ఇంకా వయసును బట్టి కాస్ట్యూమ్ డిజైన్ చేసి మరింత అందంగా చూపించారు. అలాగే అటు పాటలతో పాటు ఇటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సైన్స్ కు తగ్గట్లు చాలా ప్లెజెంట్ గా అనిపించింది. తాము అనుకున్నా కథను అనుకున్నట్లు కెమెరాల బంధించడంలో సినిమాటోగ్రాఫర్ ఇంకా కచ్చితంగా అవుట్ ఫుట్ రావడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యారు. కొన్నిచోట్ల కొన్ని సీన్లు లాగ్ అనిపించినప్పటికీ మొత్తానికిగాను చిత్రం ఒక మంచి ఎక్స్పరిమెంట్గా ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు సాధించింది.

ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, సంగీతం

మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొంచెం లాగ్ ఉండటం

సారాంశం :
ఒక కొత్త కథతో కుటుంబంలోని అన్ని వయసుల వారిని తృప్తిపరిచే విధంగా ఈ చిత్రం ఉంది.