థియేటర్లు ఓపెన్.. గైడ్‌లైన్స్ విడుదల చేసిన TS ప్రభుత్వం

సినిమా థియేటర్ల ఓపెనింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా సినిమా థియేటర్లలో పాటించాల్సిన నిబంధనలను ఇందులో పేర్కొంది. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, థియేటర్లలో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని తెలిపింది.

థియేటర్లలో భౌతిక దూరం పాటించాలని, గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం అని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ప్రతి షో ముందు కామన్ ఏరియాలో శానిటైజేషన్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్ మధ్య ఉంచాలని చెప్పింది. హ్యూమినీటిని 40 నుంచి 70 శాతం మధ్య మెంటెన్ చేయాలని చెప్పింది.

ఈ రోజు జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫోస్టును సీఎం కేసీఆర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు పలు వరాలు ప్రకటించారు. థియేటర్లలో సినిమా షోలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి గాను సినీ పెద్దలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు.