క్రికెటర్ బయోపిక్ ఎఫెక్ట్.. స్టార్ హీరో కూతురిని అత్యాచారం చేస్తామని వార్నింగ్

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతికి సోషల్ మీడియాలో ఇటీవల అనేక రకాల బెదిరింపులు రావడం అందరిని షాక్ కి గురి చేసింది. అదే విధంగా ఆయన కుటుంబంపై కూడా అదే పనిగా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి చిన్న కుమార్తెపై అత్యాచారం బెదిరింపులకు పాల్పడడం అందరిని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ విమర్శలకు కారణం శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేయడానికి ఒప్పుకోవడమేనని చివరకు ఆ బయోపిక్ నుంచి తప్పుకున్నాడు. మురళీధరన్ కూడా విజయ్ కెరీర్ ని రిస్క్ లో పెట్టడం ఇష్టం లేదని అతను సినిమా చేయకపోవడమే మంచిది అని లేఖ విడుదల చేశారు. ఇక విజయ్ కూడా అందుకు ఒప్పుకోగా.. అయినప్పటికీ బెదిరింపులు వస్తున్నాయి. ఇక ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో నెటిజన్స్ మద్దతు ఇస్తున్నారు. సింగర్ చిన్మయి కూడా విజయ్ సేతుపతికి మద్దతు అందిస్తూ చిన్నారిని రేప్ చేస్తామని చెబుతున్న ఆ వ్యక్తి అతిపెద్ద నెరస్తుడు. వెంటనే అతన్ని శిక్షించాలని చెన్నైకి చెందిన పోలీసులు ఎకౌంట్స్ ని ఆమె ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.