టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా కూడా ఇప్పటికి ఆ సినిమాలు టీవీలలో వస్తే మంచి రెంటింగ్ ని అందుకుంటాయి. అయితే ఆ మధ్య వీరిద్దరి మధ్య ఒక ప్రాజెక్ట్ వస్తున్నట్లు రూమర్స్ అయితే బాగానే వచ్చాయి.
కానీ ఖలేజా సినిమా సమయంలో త్రివిక్రమ్ పొరపాట్ల వల్లే మహేష్ మరోసారి ఆయనను నమ్మలేదని అందుకే రిజెక్ట్ చేశాడని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే అవేవి నిజం కాదని నీరూపించేందుకు మరోసారి ఈ ఇద్దరు కలవబోతున్నట్లు టాక్ వస్తోంది. త్రివిక్రమ్ ఈ కరోనా టైమ్ లో మహేష్ కోసం ఒక కథను అనుకున్నట్లు టాక్. దాదాపు స్క్రిప్ట్ సగం పూర్తయ్యిందట. మహేష్ కూడా మెయిన్ లైన్స్ విన్నట్లు సమాచారం. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్ మరోవైపు అనిల్ రావిపూడి, రాజమౌళి సినిమాలకు కమిటై ఉన్నాడు మరి త్రివిక్రమ్ కి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.