దర్శకత్వం శ్రీరామ్ వేణు, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్…

పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రానున్నాడనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పింక్ ని తమిళ్ లో అజిత్ తో రీమేక్ చేసిన బోనీ కపూర్, తెలుగులో దిల్ రాజు తో కలిసి ప్రొడ్యూస్ చేయనున్నాడు. శ్రీరామ్ వేణు తెరకెక్కించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ నెల చివరిలో పింక్ రీమేక్ పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోని, జనవరిలో రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

pawan kalyan trivikram ram charan

ఒక్కసారి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే, సినిమాని వెంటనే స్టార్ట్ చేయడానికి అవసరమైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే పవన్ రీఎంట్రీని ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టె ప్రయత్నాలు చేస్తున్నారు. పింక్ సినిమాని తెలుగులో రీమేక్ కి డైలాగ్స్ ని మాత్రం త్రివిక్రమ్ రాయనున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అవ్వడం… త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకోని దిల్ రాజు ఈ ప్లాన్ వేస్తున్నాడట. గతంలో పవన్ నటించిన తీన్మార్ సినిమాకి కూడా త్రివిక్రమ్ మాటలు రాశాడు. ఇవి సినిమానే నిలబెట్టే స్థాయికి వెళ్లాయి. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.